మంత్రిగా తొలిసంతకమే అమలు చేయలేని వ్యక్తి ఆ పదవికి అర్హురాలా? విద్యార్థుల మరణాలపై జాతీయ మానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
ఆ పాపం గిరిజన
సంక్షేమశాఖ మంత్రిదే..
సాలూరు: గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కల్పించడంలోను, ప్రాణాలు రక్షించడంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న తాడంగి చిన్నారి బుధవారం మృతిచెందిన విషయం తెలుసుకుని దిగ్బ్రాంతికి లోనయ్యారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి విద్యార్థి మృతికి ఐదు నిమిషాల పాటు మౌనంపాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇప్పటివరకు 15 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించినా మంత్రికి పట్టకపోవడం విచారకరమన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖ మంత్రికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా, సెరిబ్రల్ మలేరియాతో చనిపోతున్నారని చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఢిల్లీలో ఫిర్యాదుచేశామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాలూరు మండలం కరాసవలసలో సుమారు పదిమంది చనిపోతే నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏమిచేయలేని పరిస్థితిలో నేను నా ఎమ్మెల్యే పదవికి రాజినామా చేస్తానని ప్రకటించానని గుర్తుచేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎం పోస్టుల భర్తీచేస్తామని తొలి సంతకం పెట్టారని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలుచేయలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రిగా తొలిసంతకమే అమలుచేయలేని వ్యక్తి, మంత్రి పదవికి అర్హురాలా అని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో వసతులు, బోధన ప్రమాణాలు, విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవాలని, సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
పత్తిక దినేష్ (ఫైల్) నిమ్మక నితిన్ (ఫైల్)
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం
ఈ చావుల పాపం