
ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం
● ఈ నెల 17న ఆర్థిక సాయం
అందజేస్తాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు
జియ్యమ్మవలస: కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధితో ఇద్దరు బాలికలు మృతిచెందారని, వారి కుటుంబాలకు ఈ నెల 17వ తేదీన వైఎస్సార్‌సీపీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ పార్వీతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు చేతుల మీదుగా అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం పార్వతీపురం ఆస్పత్రిలో హెపటైటిస్–ఏతో బాధపడుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, అలజంగి జోగారావు పాల్గొంటారని తెలిపారు.