
పంపమంటూనే.. పొగ పెట్టేసింది!
సీఆర్టీలకు కూటమి మొండి చేయి వారి స్థానంలో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు ఏళ్లుగా పని చేస్తూ.. ఉన్నపళంగా రోడ్డున పడిన సీఆర్టీలు
హఠాత్తుగా తొలగిస్తే కుటుంబాలతో మేమేమి కావాలి
గత పదేళ్లుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు బోధన పరమై న సేవలందించాం. నోటిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగానే సీఆర్‌టీ ఉద్యోగాలకు ఎంపికయ్యాం. ఈ ఉద్యోగమే ఆధారంగా మా జీవితాలను నెట్టుకొస్తున్నాం. అయితే, మా పోస్టులను డీఎస్సీలో కలుపుతున్నారని సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు, పాలకులకు విన్న వించాం. భయపడాల్సిన అవసరం లేదని, కేవ లం అదనంగా ఉన్న పోస్టులను మాత్రమే భర్తీ చేస్తారని మా ఉద్యోగాలకు డోకా ఏమీ లేదని అభయ హస్తం ఇచ్చారు. చివరకు రోడ్డున పడేశారు. – మూడడ్ల స్వాతి, జియ్యమ్మవలస
గిరిజన ఆశ్రమ పాఠశాల సీఆర్టీ
తమ పోస్టులను డీఎస్సీలో చేర్చవద్దంటూ విన్నవించి నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డీఎస్సీలో చేర్చి ఇప్పుడు నియామకాల పేరుతో సీఆర్‌టీల ను తొలగించడం అన్యాయం. ఇది వారి జీవితా లతో చెలగాటం అడడమే. న్యాయస్థానంలో స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాటతప్పడం దారుణం. కొత్త నియామకాలతో సీఆర్టీలను తొలగించే ప్రక్రియను వెంటనే ఆపి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకుంటే సీఆర్టీల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటాలు, ఉద్యమాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. – భాస్కరరావు, యూటీఎఫ్,
జిల్లా జనరల్ సెక్రటరీ
సాక్షి, పార్వతీపురం మన్యం:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కోల్పోయి.. రోడ్డున పడిన వారి జాబితాలో ఇప్పుడు సీఆర్టీలు చేరారు. ఐటీడీఏ పరిధిలో ని ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలలలో దాదాపు పదేళ్లకు పైగా పొరుగు సేవలు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. రెగ్యులర్ ఉపాధ్యాయుల తో సమానంగా పనిచేస్తూ.. చాలీచాలని వేతనాల తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. ఏనాటికై నా తమకు రెగ్యులర్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో వీరి పోస్టులను కూడా కలిపేయడంతో ఆందోళన చెంది పలుమార్లు ఉద్యో గ భద్రత కోసం నిరసనలు కూడా చేశారు. గతంలో ఇదే విషయమై దాదాపు 40 రోజులపాటు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఏ ఒక్కరికీ అన్యాయం చేయబోమని జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా హామీ ఇచ్చా రు. వారి పోరాటం వృథా అయ్యింది.. ప్రజా ప్రతి నిధులు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటి వరకూ వీరు పనిచేస్తున్న పోస్టుల్లో సోమవా రం డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు విధుల్లో చేరిపోయారు. దీంతో వీరంతా రోడ్డున పడ్డారు.
ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని..
ఉమ్మడి జిల్లా పరిధిలో 280 మంది సీఆర్టీలు పని చేసేవారు. ఒక్క పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 55 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీరిలో చాలామంది సుమారు తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల్లో అందరూ క్వాలిఫైడ్ లే. పీజీ, బీఈడీ, ఎంఫిల్ వంటి ఉన్నత విద్య పూర్తి చేసిన వారున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభు త్వం వీరి పొట్ట కొట్టింది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 204 మంది పని చేస్తుండగా.. 137 మందిని డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. ఇందులో పాఠశాల సహాయకులు(ఎస్‌ఏ) 77 మంది, ఎస్జీటీలు 60 మంది ఉన్నారు. వీరంతా సోమవారం విధుల్లో చేరారు. దీంతో రెండు ఐటీడీఏల పరిధిలో 200 మందికిపైగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారంతా ప్రాథేయపడినా కూటమి ప్రభుత్వం కనికరం చూపలేదు. నిర్దాక్షిణ్యంగా ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది. కూటమి ప్రభుత్వం తీరును యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ భాస్కరరావు, గిరిజన విద్యా సంఘం, సీఅర్టీల సంఘం నాయకులు పల్లా సురేష్, ఆరిక వెంకటరావు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం అధ్య క్షుడు కె.చంద్రశేఖర్ తదితరులు తీవ్రంగా ఖండించారు. సీఅర్టీలకు అన్యాయం చేస్తే సహించబోమని.. వారికి ఉద్యోగ భద్రత కల్పించే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
అధికారంలో ఉన్న మంత్రుల సైతం మా ఉద్యోగాలకు ఇబ్బంది ఏమీ లేదంటూ స్పష్టమైన హామీ ఇచ్చా రు. అన్యాయంగా మా పో స్టులను డీఎస్సీలో చేర్చారు. ఇప్పుడు ఉన్నట్లుండి డీఎస్సీ ద్వారా ఎంపికై న కొత్తవారిని మా స్థానాల్లో నియమించారు. మా పరిస్థితి ఏంటో అర్ధంకాని దుస్థితిలో ఉన్నాం. మా కుటుంబాలతో మేము ఏం కావాలో అర్ధం కావడం లేదు. దశాబ్ధకాలం ప్రభుత్వ పాఠశాలకే అంకితమైన మా జీవితాలను అంధకారంలోకి నెట్టవద్దని ప్రాథేయపడుతున్నాం.
– లక్ష్మి, టి.కె.జమ్ము, గిరిజన ఆశ్రమ పాఠశాల, సీఆర్టీ

పంపమంటూనే.. పొగ పెట్టేసింది!

పంపమంటూనే.. పొగ పెట్టేసింది!

పంపమంటూనే.. పొగ పెట్టేసింది!

పంపమంటూనే.. పొగ పెట్టేసింది!