
కాస్త పెరిగిన తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: నాగావళి నదిలో తోటపల్లి ప్రాజె క్టు వద్ద నీటి ప్రవాహం కాస్త పెరిగింది. సోమ వారం సాయంత్రానికి 105 మీటర్లకు 104.2 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 6,953 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తివేసి 4,939 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నట్టు అధికారులు తెలిపా రు. కాలువలకు 1300 క్యూసెక్కులు నీటిని విడిచిపెడుతున్నామన్నారు.
పార్వతీపురం రూరల్: జిల్లాను ఓ వైపు జలపా తాల ఖిల్లాగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తూనే, మరోవైపు గిరిజన గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న డోలీ మోతలకు శాశ్వతంగా చరమ గీతం పాడాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ జలపాతాన్ని గుర్తించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. అదే సమయంలో ప్రతీ మారుమూల గ్రామానికి అంబులెన్స్ వెళ్లేలా రోడ్ల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె. హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ జీవీ వీసీ బాధ్యతల స్వీకరణ
● విద్యాప్రమాణాల మెరుగుకు కృషిచేస్తా: వీసీ వి.వి.సుబ్బారావు
విజయనగరం రూరల్: జేఎన్‌టీయూ–గురజాడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (వీసీ) వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేఎన్‌టీయూ కాకినాడ రెక్టార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై వీసీగా నియమిస్తూ ఈ నెల 8న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన వర్సిటీ అధికారులు, ఆచార్యుల సమక్షంలో తాజాగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు చర్యలు తీసుకుంటానన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల పెంపు, బోధన సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, అధికారుల సహకారంతో వర్సిటీ పురోగతికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
మహారాణిపేట (విశాఖ): కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 21 మంది పచ్చ కామెర్ల బాధితులను సోమవారం కేజీహెచ్ నుంచి పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని, వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్ (గ్యాస్ట్రో ఎంటాలజీ), డాక్టర్ శివకళ్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు) సహా ఐదుగురు వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థుల తరలింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు పలు విడతల్లో మొత్తం 44 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 50 మంది విద్యార్థినులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. వీరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న తోయక కల్పన, పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు.