
సైబర్ నేరాలపై అప్రమత్తం
● సీఐ కె.మురళీధర్
పార్వతీపురం రూరల్: ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం పట్టణ సీఐ కె.మురళీధర్ సూచించారు. ఈ మేరకు స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ట్రాఫిక్ ఎస్సై పాపారావు ఆధ్వర్యంలో వాహన చోదకులకు, స్థానికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓటీపీ, సీవీవీ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ లాటరీలు, బహుమతుల వంటి మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్తలు వహించాలని హితవు పలికారు. కార్యక్రమంలో వాహన చోదకులు, స్థానికులు ఉన్నారు.