
తండ్రిని చంపిన కేసులో తనయుడి అరెస్టు
బాడంగి: మండలంలో సంచలనం రేపిన తండ్రిని చంపిన తనయుడి హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి హత్యకు కారణమైన కుమారుడు బోనుగిరి లక్ష్మణరావును శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం బొబ్బిలి కోర్టుకు తరలించారు. దీ నికి సంబంధించిన వివరాలను డీఎస్పీ భవ్యరెడ్డి వి లేకరులకు వెల్లడించారు. మద్యానికి బానిసగా మారి డబ్బులకోసం తరచూ తండ్రితో లక్ష్మణరావు గొడవ పడుతుండేవాడని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రినుంచి కీచులాట పెట్టుకున్నా ససేమిరా డబ్బులిచ్చేది లేదని తండ్రి చెప్పడంతో చెప్పుల మేకులు చెరిచే గూటంతో గురువారం తెల్ల వారు జామున తండ్రి రాజేశ్వరరావు కుడి చెవిపై బలంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. నిందితుడిని పిన్నవలస జంక్షన్‌లో పట్టుకుని ఆరెస్టు చేశామని తెలిపారు. బొబ్బిలిరూరల్ సీఐ. నారాయణరావు, ఎస్సైతారకేశ్వరరావుల కృషిని ఆమె అభినందించారు.