
ఏనుగు పిల్ల మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామ ముదిరాజు చెరువులో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగు మృతి చెందింది. ఇటీవల కొద్ది వారాల నుంచి పార్వతీపురం మండలంలోని తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగును పెద్ద ఏనుగులు తొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరణానికి కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై ఎలిఫెంట్ మా నటరింగ్ అధికారి మణికంటేశ్వరరావు మాట్లాడుతూ ఏనుగు పిల్ల వయసు ఏడు నెలలని తెలిపారు. పోస్టుమార్టం నిమత్తం కొమరాడ మండలం అర్తాం తరలించామని చెప్పారు.
కారు ఢీ కొని లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సమీపంలో గల భారత్ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ లారీ డ్రైవర్ తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ గేదెల వెంకటరావు లారీతో విజయనగరం వెళ్తూ ముచ్చర్లవలస పెట్రోల్ బంకు వద్ద మూత్ర విజర్జన కోసం జాతీయ రహదారి పక్కన లారీ ఆపి రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఆ సమయంలో రామభద్రపురం నుంచి విజయనగరం వెళ్తున్న కారు లారీ డ్రైవర్‌ను ఢీ కొట్టింది. దీంతో వెంకటరావు తీవ్ర గాయాలపాలై తుళ్లిపోవడంతో మృతిచెందాడేమోనని భావించి కారు డ్రైవర్ రోడ్డు కారు రోడ్డు పక్కన పెట్టేసి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రథమ చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఎస్సై వి. ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాన్‌బోల్తా పడి యువకుడి మృతి
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామంలో వ్యాన్ బోల్తా పడి గ్రామానికి చెందిన పెనుమజ్జి కుమార్(25) మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా వ్యాన్‌లో ఐరన్ రాడ్లు తీసుకువచ్చారు. ఐరన్‌లోడుతో ఉన్న వ్యాన్‌ను ఎత్తు భాగానికి ఎక్కిస్తుండగా బోల్తాపడింది. దీంతో వ్యాన్ పక్కనే ఉన్న పెనుమజ్జి కుమార్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. తల్లిదండ్రులు ఆదిబాబు, చిట్టెమ్మ దంపతులకు కుమార్ పెద్ద కొడుకు కాగా సమీపంలో ఉన్న పవర్‌ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఏనుగు పిల్ల మృతి