
గిరిజన గర్భిణి వసతిగృహాల సిబ్బందిని కొనసాగించాలి
పార్వతీపురం రూరల్: గిరిజన గర్భిణుల వసతిగృహాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని, అలాగే వారికి బకాయి పడిన 40నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏపీ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ, గిరిజన సంక్షేమసంఘం నాయకులు బీవీ రమణ, పి.రంజిత్ కుమార్‌లు డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం కలెక్టరేట్ వద్ద సిబ్బందితో కలిసి వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొంది యునెస్కో, నీతి అయోగ్ వంటి సంస్థల మ న్ననలు అందుకున్న గిరిజన గర్భిణుల వసతిగృహాల నిర్వహణ సిబ్బందిపై అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తూ సిబ్బందిని తొలగించాలని ఆలోచన చేయడం పై మండిపడ్డారు. కార్యక్రమంలో కరణం త్రివేణి, అలమండ రాములమ్మ, డి.దేవి, నాగమణి, నందిని పాల్గొన్నారు.