
వెబ్ ల్యాండ్‌లో తప్పులు సరిచేయాలి
● రెవెన్యూ అధికారులను ఆదేశించిన జేసీ
పార్వతీపురంటౌన్: జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది తెలిపారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి రెవెన్యూ, రీసర్వే, వెబ్ ల్యాండ్ కేసులపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. మానవీయకోణంలో పరిష్కరించేందుకు కృషిచేయాలని చెప్పారు. రికార్డుల మేరకు సమస్యల పరిష్కారం ఉండాలని, పరిష్కారం కాని వాటిపై అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. రీ సర్వే పక్కాగా ఉండాలని తేల్చిచెప్పారు. వెబ్ ల్యాండ్‌లో ఉన్న తప్పులు సరిచేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఇప్పటికే పార్వతీపురంలో జరిగిందని, పాలకొండలో కూడా నిర్వహించాలని జేసీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తికి గాయాలు
గంట్యాడ: మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన పంకుంతల తులసి అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తుండగా గొడియాడ సమీపంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

వెబ్ ల్యాండ్‌లో తప్పులు సరిచేయాలి