
ఉత్సాహంగా సైనిక్ స్కూల్ క్రీడా సంబరాలు
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక్ పాఠశాల వార్షిక క్రీడా సంబరాలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కోరుకొండ సైనిక్ పాఠశాల సైకోర్ స్పోర్ట్స్ మైదానంలో నిర్వహించిన 64వ వార్షిక అథ్లెటిక్స్ మీట్‌ను, పాఠశాల ప్రిన్సిపాల్ గ్రూప్ కెప్టెన్ ఎస్‌ఎస్ శాస్త్రి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో సైనిక పాఠశాలలోని శాతవాహన, చాళుక్య, గజపతి, గుప్తా, మొఘల్ హౌస్‌లకు చెందిన సీనియర్ విద్యార్థులు, అలాగే పాండ్య, మౌర్య, పల్లవ, కాకతీయ హౌస్‌లకు చెందిన జూనియర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్‌ఎస్ శాస్త్రి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి తోడ్పడతాయని, ప్రతి విద్యార్థి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి ఆడాలని సూచించారు.

ఉత్సాహంగా సైనిక్ స్కూల్ క్రీడా సంబరాలు