
ఏఓబీలో ఎకై ్సజ్ దాడులు
● 730 లీటర్ల సారా, 9700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
కురుపాం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాలకు చెందిన ఎకై ్సజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దాడుల్లో భారీగా సారా, సారా తయారీకి ఉంచిన బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సర్కిల్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.శ్రీనాథుడుడు, ఏఈఎస్ ఎ.సంతోష్‌ల ఆదేశాల మేరకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలు సందుబడి, రంబళబ లబాయ్, రేగుల పాడులలో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 9700 లీటర్ల బెల్లం ఊట, విక్రయానికి సిద్ధంగా ఉంచిన 730 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఒడిశా సరిహద్దు నుంచి సారా రవాణా చేస్తున్న వారి పేర్లు, పూర్తి సమాచారం తమ వద్ద ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.