
ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి
పార్వతీపురం రూరల్: ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి అవగాహనతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. మంగళవారం ప్రపంచ ఓజోన్ పొర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పర్యవరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఓ3 అక్షరాల ఆకారంలో ఏర్పడి ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు గౌరి, ప్రసాదరావు, భవానీ దేవి, శశిధర్ కుమార్‌తో పాటు అమరాపు సూర్యనారాయణ, దావీదు, జన, విజయ్, ఉమ, రామలింగస్వామి, శ్రీను, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.