
భారత్ తో భాగస్వామ్యానికి ఫ్రాన్స్ ఆసక్తి
● ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ మార్క్ లామి
నెల్లిమర్ల రూరల్: భారత్‌తో విద్యా భాగస్వామ్యానికి ఫ్రాన్స్ దేశం ఆసక్తి చూపిస్తోందని ఆ దేశం కాన్సులేట్ జనరల్ మార్క్ లామి అన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ దేశం వివిధ విద్యా సంస్థలతో నైపుణ్యాల పెంపుదలకు కృషి చేస్తోందన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీలు భారత్‌లో విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పా రు. భారత్‌లో ఫ్రాన్స్ రాయబార కార్యాలయాలు, ఇండో ఫ్రాన్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ కంపెనీలు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నాయన్నారు. భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవా లని సూచించారు. 15 ఫ్రెంచ్ కంపెనీలు ఏపీ, ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, నైపుణ్యం కలిగిన యువతకు అతి తక్కువ సమయంలోనే మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ సిస్టమ్స్‌తో సెంచూరియన్ వర్శిటీ భాగస్వామ్యం ప్రశంసనీయమన్నారు. విద్యా బోధనలో భాగంగా సెంచూరియన్ విశ్వ విద్యాలయం నైపుణ్యాలను జోడించడం, విద్యాభివృద్ధికి వివిధ కార్యక్రమాలను అమలు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పా రు. అనంతరం వివిధ ల్యాబ్‌లను సందర్శించి జీటీఎం ల్యాబ్, వెల్‌నెస్ సెంటర్, త్రీడీ డేటా సెంటర్, బ్రీడింగ్ ల్యాబ్‌లను ప్రారంభించారు. కార్యక్రమంలో సెంచూరియన్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు, చాన్స్‌లర్ జీఎస్‌ఎన్ రాజు, వీసీ ప్రశాంత కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, ఐక్యూఏసీ ప్రొఫెసర్ ఎంఎల్‌ఎన్ ఆచార్యులు పాల్గొన్నారు.