
సమన్వయంతో పనిచేద్దాం.. ప్రగతి సాధిద్దాం
పార్వతీపురం రూరల్: జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశమందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారుల అనుభవాలు జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని, సూపర్‌విజన్‌తో జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా అన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు సాధించిన పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు డా.ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత, డిప్యూటీ కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కె.రాబర్ట్‌పాల్, ఉద్యాన వన శాఖాధికారి వై.క్రాంతికుమార్ పాల్గొన్నారు.
బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూరులో వెలసిన కోడూరుమాత యాత్రోత్సవం శనివారం కనులపండువగా జరిగింది. వేలాదిమంది క్రైస్తవ, క్రైస్తవేతర భక్తులు మరియమ్మను దర్శించుకున్నారు. టెంకాయలు కొట్టారు. తలనీలాలు సమర్పించారు. విశాఖ అగ్రీపీఠాధిపతి బాల, ఫాదర్లు చెప్పిన బైబిల్ వాక్యాలను శ్రద్ధగా విన్నారు. బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సీఐ నారాయణరావు, బాడంగి, రామభద్రాపురం, తెర్లాం ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
పార్వతీపురం రూరల్: కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కలెక్టరేట్ యూనిట్, పార్వతీపురం డివిజన్‌లకు సంబంధించిన ఎన్నికలు నిర్వ హించారు. కార్యవర్గ సభ్యులు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల నిర్వాహకులు ఎం.రాజేంద్ర, ఎం.ఎన్.ప్రసాద్ తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, మెంబర్లుగా కలెక్టరేట్ యూనిట్‌కు సంబంధించి 12 మందిని, పార్వతీపురం డివిజన్‌కు సంబంధించి 12మందిని ఏకగ్రీంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.
కలెక్టరేట్ యూనిట్ కార్యవర్గం ఇదే..
అధక్షుడిగా కె.చంద్రమౌళి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎ.చిన్నారావు, ఉపాధ్యక్షులులుగా ఎం.మంజూస, కె.సుధీర్‌బాబు, సెక్రటరీగా సీహె చ్ రాజేష్, జాయింట్ సెక్రటరీలుగా కె.సూర్యారావు, బి.మనోజ్‌కుమార్, బి.శ్రీనివాసరావు, ట్రెజరర్‌గా టి.వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పి.మోహన్‌కృష్ణ, కె.సన్యాసిరావు ఎన్నికయ్యారు.
పార్వతీపురం డివిజన్ యూనిట్ కార్యవర్గం ఇదే..
అధ్యక్షుడిగా బాలమురళీకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.కిరీటి, ఉపాధ్యక్షులుగా ఎం. జగదీశ్వరరావు, పి.తిరుమలరావు, ఎన్.సునీత, సెక్రటరీగా పి.రమేష్‌నాయుడు, జాయింట్ సెక్రటరీలుగా జి.శ్రీనివాసరావు, టి.రమేష్, వై.విజయకుమార్, ట్రెజరర్‌గా ఎం.రాజేంద్ర, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎం.రమణమూర్తి, సీహెచ్ పద్మిని సువర్ణ ఎన్నికయ్యారు.
విజయనగరం ఎస్పీగా దామోదర్
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కొత్త ఎస్పీగా ఎం.ఆర్.దామోదర్ నియామకమయ్యారు. ఈయన 2013 బ్యాచ్‌కు చెందినవారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. ఆయన 2019లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇంతవరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన వకుల్‌జింద్‌ల్‌కు గుంటూరు జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యింది.

సమన్వయంతో పనిచేద్దాం.. ప్రగతి సాధిద్దాం

సమన్వయంతో పనిచేద్దాం.. ప్రగతి సాధిద్దాం