
పది లారీలు సీజ్
కొత్తవలస : పరిమితికి మించి అధిక బరువులను రవాణా చేస్తున్న పది లారీలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ బి.సింహాచలం ఆధ్వర్యంలో శనివారం సీజ్ చేశారు. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో రోడ్డు రవాణ శాఖ అధికారులు, విజిలెన్స్ అదికారులు సంయుక్తగా దాడులు నిర్వహించారు.అధిక బరువుతో రవాణా చేస్తున్న పది లారీలను గుర్తించి సీజ్ చేసి రూ 6.80 లక్షలు జరిమానా విధించారు. సీజ్ చేసిన లారీలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌కుర్, ఐశ్వర్యలక్ష్మి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.