
విలేకరుల సమావేశం కవర్ చేస్తే కేసులు పెడతారా?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ గొంతునొక్కేందుకు చూస్తోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలను జర్నలిస్టు వార్తగా రాస్తే కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రం హక్కు అమలులో ఉందా?లేదా? అనే ఆందోళన కలుగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సమంజసం కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కూటమి పాలకుల తీరును గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి.
– అలజంగి జోగారావు,
మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం
కలంపై కక్షసాధింపు తగదు
ప్రశ్నించే కలంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు తగదు. రాజ్యాంగంలో పత్రికా రంగం నాలుగో స్తంభం. ఒక పత్రికపై అక్కసు వెళ్లగక్కితే మరన్ని పత్రికలు ప్రశ్నిస్తాయి. లోపభూయిష్ట పాలనపై వ్యతిరేక వార్తలు రావడం సహజం. వాటిలో లోపాలను గుర్తించి, వాటిని సరిచేసుకుని సర్కారు ముందుకు వెళ్లాలి. విలేకరుల సమావేశంలో ఓ రాజకీయ నాయకుడి ప్రసంగాన్ని ప్రచురిస్తే కేసు పెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికై నా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కూడా ప్రస్తుత ప్రజా ప్రతినిధులు అవినీతిపై వార్తలు వచ్చాయి. అంతమాత్రాన వారిపై కూడా కేసులు పెట్టారా...పెడతారా..?. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– విశ్వాసరాయి కళావతి,
పాలకొండ మాజీ ఎమ్మెల్యే

విలేకరుల సమావేశం కవర్ చేస్తే కేసులు పెడతారా?

విలేకరుల సమావేశం కవర్ చేస్తే కేసులు పెడతారా?