
కేరళలో కోన యువకుడు ఆత్మహత్య
మక్కువ: మండలంలోని కోన గ్రామానికి చెందిన మడక గోవర్ధనరావు( 30) కేరళ రాష్ట్రంలో గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..గోవర్ధనరావు కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏమైందో తెలియదుగాని తాను అద్దెకుంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు.
మృతికి గల కారణాలు తెలియరాలేదు. గోవర్ధనరావు మృతి చెందాడన్న వార్త తెలిసిన తల్లిదండ్రులు రామకృష్ణ, చిన్నమ్మలు కన్నీరుమున్నీరయ్యారు.