
ఇదే మా రోడ్డు.. రాకపోకలు ఎలా!
చిత్రంలో కనిపిస్తున్నది కురుపాం
మండలం మొండెంఖల్లు పంచాయతీ
తాబేలుగూడ నుంచి గోర్జిపాడు గ్రామానికి వెళ్లే రోడ్డు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు బురదమయంగా మారింది. రాకపోకలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాబేలుగూడలో పాఠశాల లేకపోవడంతో 1.5 కిలోమీటర్ల దూరంలో గోర్జిపాడు
పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారులు ప్రతిరోజూ నరకయాతన పడుతున్నారు. అటువైపుగా వెళ్లేవారందరికీ చూడండి.. చూడండి.. ఇదే మా రోడ్డు.. బాగుచేసేవారే లేరు.. అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
– గుమ్మలక్ష్మీపురం(కురుపాం)