
అమ్మో.. జ్వరాలు..!
సీతంపేట:
ఏజెన్సీ ప్రజలను జ్వరాలు వణికిస్తున్నాయి. ఆస్పత్రులకు పరుగుపెట్టిస్తున్నాయి. జ్వర పీడితు ల్లో కొందరు మృతిచెందుతుండడం కలవరపెడుతోంది. దోనుబాయి పీహెచ్‌సీ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో బాలింత, శిశువు మృతి చెందారు. అంతకముందు మరో ముగ్గురు మృతి చెందారు. చీడిమానుగూడకు చెందిన ఆరిక ప్రియాంక జ్వరంతో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో ఈ నెల 20న మృతిచెందింది. అప్పటికి నెలరోజుల కిందట ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా సరైన ఫీడింగ్ లేకపోవడం, తక్కువ బరువు కారణాలతో గురువారం మృతి చెందినట్టు వైద్యులు తెలి పారు. నాలుగు రోజుల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
●కొత్తగూడకు చెందిన సవర భాస్కరరావు జూలై 4న జ్వరంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్‌లో వైద్యసేవలు పొంది మృతిచెందాడు. అలాగే, దీసరిగూడకు చెందిన సవర ఆనందరావు జూన్ 6న జ్వరంతో అస్వస్థతకు గురై తనువుచాలించాడు. అక్కడికి నెలరోజుల కిందట (మే 9న) నాయకమ్మగూడకు చెందిన బాలుడు ఆరిక మోహిత్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ తొలుత దోనుబాయి పీహెచ్‌సీలోను, తర్వాత సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
●ఎపిడమిక్ సీజన్ ఆరంభమై ఇప్పటివరకు దోను బాయి పీహెచ్‌సీ పరిధిలో సుమారు 83 మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యరికార్డులు చెబుతున్నాయి. గ్రామాలకు వచ్చే సంచి వైద్యులు, ఇత ర ప్రైవేటు క్లినిక్‌లలో వైద్యసేవలు పొందిన మలేరి యా పీడితుల సంఖ్య దీనికి రెండింతలు ఉంటుంద న్నది సమాచారం. హైరిస్క్ మలేరియా గ్రామాల్లో ఐఆర్‌ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నా మలేరియా వ్యాప్తి చెందుతుండడంపై వైద్యవర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
దోనుబాయి పీహెచ్‌సీ పరిధిలో పెరుగుతున్న మృతులు నాలుగు రోజుల వ్యవధిలో తనువు చాలించిన బాలింత, శిశువు అంతకముందు మరో ముగ్గురు
జ్వరంతో మృతి
జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
జ్వరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పీహెచ్‌సీల పరిధిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. మందులన్నీ అందుబా టులో ఉన్నాయి. ఇప్పటికే మలేరియా ప్రభావి త గ్రామాల్లో రెండుసార్లు దోమల నివారణా మందును పిచికారీ చేయించాం.
– కె.విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
భద్రగిరి సీహెచ్‌సీకి రోగుల తాకిడి
గుమ్మలక్ష్మీపురం: మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. సీజనల వ్యాధులతో పాటు వైరల్ జ్వరాలతో బాధపడుతూ వైద్యసేవల కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. రక్త పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ఇన్‌పేషేంట్లుగా చేరి వైద్యసేవలు పొందుతున్నారు.

అమ్మో.. జ్వరాలు..!

అమ్మో.. జ్వరాలు..!