
ఎర్ర చందనం..!
అందానికి అందం
భామిని: కళ్లు చెదిరే ధర..మన్నికకు మన్నిక..ఇంట్లో ఉంటే శుభకరం.. ఏజెన్సీ ప్రాంతాల్లో పెరుగుతున్న ఎర్రచందనం తోటలు అందానికి అందంగా ఉంటూ స్థిరాస్తిగా మొక్కల సాగు చేపడుతున్నారు. ఎర్ర చందనం ప్రత్యేకతలెన్నో దీని శాసీ్త్రయ నామం టేరోకార్పస్ శాంటాలినస్. దీని కాండంలోని చేవ(ముదిరిన భాగం)కుంకుమ రంగులో ఉండడంతో రక్త చందనంగా పిలుస్తారు. చెట్టును నరికే సమయంలో సువాసన వెదజల్లుతుంది. శాఖోపశాఖలు లేకుండా నిటారుగా చెట్లు పెరుగుతాయి. దీని కాండం సుమారు 50 నుంచి 150 సెంటీమీటర్లు మాత్రమే విస్తరిస్తుంది. 20 నుంచి 30 అడుగుల వరకు చెట్లు నిటారుగా పెరుగుతాయి. పొలం గట్లు, ఇతర పంటలలో సాగుచేసినా పంటలకు నష్టం ఉండదు. దశాబ్దాల కాలంలో చెట్లు చేవదేరుతాయి. కొట్టేసిన చెట్లు మొదళ్ల నుంచి మళ్లీ మొలకలు పుట్టి చెట్లుగా ఎదగడం దీని ప్రత్యేకత. ఎర్రచందనం కలప దుంగల సాంద్రత నీటి స్పెసిపిక్ గ్రావిటీ కంటే తక్కువ కావడంతో నీటిలో మునుగుతాయి.
ఏజెన్సీల్లో విస్తరణ..
రెడ్‌శాండిల్ తోటలు పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలకు పాకుతున్నాయి. భామిని, సీతంపేట, పాలకొండ, పార్వతీపురం, కొమరాడ, మక్కువ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో రెడ్ శాండిల్ తోటలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా తివ్వాకొండ పరిసరాల్లో గిరిజనులు సైతం సాగు చేస్తున్నారు. కడియం నర్సరీ నుంచి అంటుకట్టిన మొక్కలు సులభంగా గ్రామాలకు చేరుతున్నాయి. చివరికి అటవీశాఖ నిర్వహించే సామాజిక నర్సిరీలలోనూ రెడ్‌శాండిల్ మొక్కలు పెంచి పంపిణీ చేస్తున్నారు. కొండ ప్రాంతాలతో పాటు పల్లపు ప్రాంతాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో శాండిల్ సిటీలు వ్యాప్తి చెందుతున్నాయి. విద్యాసంస్థలలో సుందరంగా రక్త చందనం చెట్లు తోపులుగా పెరుగుతున్నాయి.
సాగుకు ప్రోత్సాహం..
అంతరించిపోతున్న వృక్ష,జంతు జాతుల వాణిజ్యంపై అంతర్జాతీయ ఒడంబడిక(సైట్స్) గతంలో విధించిన నిషేధాన్ని సడలించింది. ఎర్రచందనంతో తయారు చేసిన సంగీత వాయిద్యాలు, పరికరాలు, రసాయనాలు, రంగుల వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు అనుమతులు ఇవ్వడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఔషధ గుణాలు మిన్న
స్థిరాస్తిగా సాగు
తరాలుగా చెక్కుచెదరని దృఢత్వం
యథేచ్ఛగా మొక్కల అమ్మకం

ఎర్ర చందనం..!