
శాకంబరిగా పోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారు మంగళవారం శాకంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చదురుగుడి, వనంగుడిలలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవార్లకు, గ్రామ శివారు ఆలయంలో కొలువైన పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారిని ఈవో బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అర్చకుడు శ్రీపతి దుర్గాప్రసాద్ శర్మ ఆద్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలనుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో గ్రామపెద్దలు, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

శాకంబరిగా పోలమాంబ

శాకంబరిగా పోలమాంబ