
మట్టి ఖర్చులకూ ఎదురు చూపులే..!
● దహన సంస్కార ఖర్చులను చెల్లించని ప్రభుత్వం ● పింఛన్‌దారులకు గత మార్చి నుంచి చెల్లింపుల్లేవ్..
సాక్షి, పార్వతీపురం మన్యం :
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణించి నా.. రిటైర్డ్ ఉద్యోగులుగానీ, వారి భార్యలుగానీ మృతి చెందినా.. మట్టి ఖర్చులు (దహన సంస్కా ర ఖర్చులు) నిమిత్తం ప్రభుత్వం రూ.25 వేలు చెల్లిస్తోంది. ప్రధానంగా పెన్షనర్ చనిపోతే అంతిమ సంస్కా రాలు నిర్వహించేందు కు తక్షణ సాయంగా మట్టి ఖర్చుల కింద రూ.25 వేలు అందించాలి. గతంలో పెన్షన్‌లో సగం మొత్తం లెక్కగట్టి ఇచ్చేవారు. 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ మొత్తాన్ని సవరించి.. రూ.25 వేలు చేశారు. పెద్ద దిక్కు పోయిన ఆ కుటుంబానికి ఈ మొత్తం ఎంతో ఆసరాగా ఉండేది. ప్రస్తుతం గత మార్చి తర్వాత ఏ ఒక్కరికీ చెల్లింపులు చేయలే దు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు ప్రధా న ఖజానా కార్యాలయాలతో పాటు.. 14 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. ఒక సబ్ ట్రెజరీ పరిధిలో నెలకు కనీసం అయిదుగురికి తక్కువ కాకుండా రిటైర్డ్ ఉద్యోగులుగానీ, వారి భార్యలుగానీ మరణిస్తున్నారు. ఇటువంటి వారు సీఎఫ్‌ఎంఎస్‌లో మరణ ధ్రువపత్రంతో పాటు.. సంబంధిత వివరాలతో ఖజానా కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ట్రెజరీలో బిల్లులు అప్రూవల్ అయినప్పటికీ.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వారికి చెల్లింపులు జరగడం లేదు. గత మార్చి నుంచి ఒక్కరికి కూడా మట్టి ఖర్చులు రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యూ టీ చెల్లించడం లేదు. ఈ మొత్తమే పెద్ద ఎత్తున బకాయిలు ఉండిపోయాయి. మెడికల్ బిల్లులు సైతం జమ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. తమకు రావాల్సిన బకాయిల కోసం రిటైర్ ఉద్యోగులు ఖజానా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మట్టి ఖర్చులూ చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని పింఛనుదారుల సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు సరికాదని మండిపడుతున్నారు.
పార్వతీపురంలోని బెలగాంకు చెందిన పి.ప్రకాశరావు అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు గత ఏప్రిల్ నెలలో మృతి చెందారు. మూడు నెలల క్రితం పెట్టిన మట్టి ఖర్చుల బిల్లులు నేటికీ అందలేదని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గరుగుబిల్లి మండలానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దువ్వాడ సంగం భార్య అప్పలనర్సమ్మ మృతి చెందడంతో మే నెలలో ట్రెజరీ అధికారులకు సమాచారం అందించారు. అంత్యక్రియల ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ ఖర్చులు జమ కాలేదు. దీంతో పాటు.. కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ మరణించిన ఆయన భార్యకు సంబంధించిన మెడికల్ బిల్లులు రూ.1,20,000 మేర గత ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకున్నా, నేటికీ ప్రభుత్వం చెల్లించలేదు.