
పాఠశాల భవనం మంజూరుకు చర్యలు
సీతంపేట: మండలంలోని ఎగువదరబ గిరిజన గ్రామ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై ‘నమ్మండి ఇదే వారి బడి’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ అధికారులు స్పందించారు. ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు గురువారం ఎగువదరబ గ్రామాన్ని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. భవనాలు లేని పాఠశాలలకు పక్కా భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైతే పక్కా భవనం నిర్మిస్తామన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాల సీఆర్‌టీ ఉపాధ్యాయుడు గైర్హాజరు కావడంతో మెమో జారీచేయాలని విద్యాశాఖ అధికారులకు ఆయన సూచించారు.
అడ్డాకుల గూడను
సందర్శించిన వైద్యబృందం
● అడ్డాకుల గూడను సందర్శించిన
వైద్య బృందం
సీతంపేట: ‘అడ్డాకుల గూడను వణికిస్తున్న కిడ్నీ భూతం’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి వైద్యశాఖాధికారులు స్పందించారు. కుశిమి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ చాందిని నేతృత్వ్యంలో వైద్యసిబ్బంది అడ్డాకుల గూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న సవర బూగన్న, అప్పయ్య ఇళ్లకు వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. గ్రామస్తులు తాగుతున్న నీటిని పరిశీలించారు. కాచిచల్లార్చిన తర్వాత నీరు సున్నం కలర్‌లో మారడాన్ని గమనించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో వ్యాధుల వ్యాప్తి, కిడ్నీ వ్యాధి తో ఎంతమంది బాధపడుతున్నారు.. గతంలో ఎవరెవరు మరణించారన్న వివరాలు తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజే స్తామని తెలిపారు.

పాఠశాల భవనం మంజూరుకు చర్యలు

పాఠశాల భవనం మంజూరుకు చర్యలు