
● కళ తప్పిన సచివాలయం
చిత్రంలో కనిపిస్తున్నది వేపాడ మండలంలోని నీలకంఠరాజపురం సచివాలయం. గతంలో ఇక్కడ 11 మంది సిబ్బంది విధులు నిర్వర్తించేవారు. వ్యవసాయ, సంక్షేమ, పశుసంవర్థక, రక్షక, సాంకేతిక, విద్యాసంబంధ, రెవెన్యూ, వైద్య తదితర సేవలు గ్రామస్తులకు అందేవి. ఇప్పుడు 11 పోస్టుల్లో ఆరు ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రసూతి సెలవులో ఉండడంతో ముగ్గురు సిబ్బంది, ఒక పంచాయతీ కార్యదర్శి మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీఆర్‌ఏ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, రైతుసేవా కేంద్రంలో వీఏఏ, వీఈఏ, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శితో పాటు ఏఎన్‌ఎం, మహిళా పోలీస్, సర్వేయర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు పూనుకుందని, అందుకే సిబ్బంది సంఖ్యను తగ్గిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – వేపాడ