
కిడ్నీ భూతం ఏజెన్సీని భయపెడుతుందా..! అంటే అవుననే సమాధాన
● రెండేళ్లలో ఐదుగురి మృతి ● రెండు కుటుంబాల్లో ఇద్దరు చొప్పున మృతి ● మంచంపై మూలుగుతున్న మరో ఇద్దరు రోగులు ● దిగువదరబలో మరొకరు ● ఏజెన్సీ గిరిజనుల్లో ఆందోళన
అడ్డాకులగూడ గ్రామం
తాగునీరే కారణమా..?
అడ్డాకులగూడ గ్రామంలో తాగునీటి పథకం, సోలార్ రక్షిత పథకం, మరో బోరు ఉంది. గ్రామంలో మొత్తం 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ నీటినే గిరిజనులు వినియోగిస్తున్నారు. నీరు మరగబెడితే సున్నం నీరు రంగులోకి మారుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీని వలన కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమోనని గ్రామంలో గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీతంపేటకు అరకు ఎంపీ పర్యటనకు వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆమె దృష్టికి ఈ విషయమై తీసుకువెళ్లారు. స్పందించిన ఎంపీ తన ఎంపీ ల్యాడ్ నిధుల నుంచి ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
సీతంపేట:
ఉద్దానం ప్రాంతంలో ఎందరినో పొట్టన పెట్టుకున్న కిడ్నీ రోగం ఇప్పుడు ఏజెన్సీలో చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఈ విషయం ఏజెన్సీ గిరిజనులకు అంతగా తెలియకపోవడంతో వెలుగులోకి రావడం లేదు. అయితే రెండేళ్ల కిందట నుంచి దర బ పంచాయతీ పరిధిలోని అడ్డాకులగూడ, దిగువదరబ గ్రామాల్లో కిడ్నీ వ్యాధులతో పలువురు గిరిజనులు బాధపడుతున్న విషయం వెలుగులోకి రావ డంతో ఆందోళన నెలకొంది. పాలకొండ – సీతంపే ట రహదారి పక్కనే ఉన్న అడ్డాకులగూడ గ్రామంలో ఇప్పటికే ఐదుగురు ఈ వ్యాధితో మృతి చెంద డం గమనార్హం. చిన్నసొంబురు, బంగారమ్మ భార్యాభర్తలు. అలాగే ఎస్.బూగన్న, శివసారి తండ్రి కుమార్తెలు. మరో మహిళ మిలీత ఇదే గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. గ్రామంలో సవర అప్పయ్య, సవర బూగన్న కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ప్రస్తుతం పాలకొండ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. అలాగే దిగువదరబ గ్రామానికి చెందిన సవర మంగయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పాలకొండ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వీరు కొండపోడు పనులు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కిడ్నీ రోగులకు నెలకు రూ.పది వేల పింఛన్ ప్రవేశపెట్టడంతో కుటుంబాన్ని నెట్టుకురావడానికి, మందుల ఖర్చులకు సరిపోతుందని వారు చెబుతున్నారు. లేకుంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం..
దరబ పంచాయతీ పరిధి అడ్డాకులగూడ, దరబ గ్రామాల్లో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్న విషయం తెలిసింది. ఇందు కు సంబంధించి వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న రోగులు డయాలసిస్ ప్రతీ వారం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చేయించుకుంటున్నారు.
– కె.విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఐటీడీఏ, సీతంపేట
పరిశోధన చేయాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో కిడ్నీ రోగాలతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నా రు. అడ్డాకులగూడలో ఎక్కువ మంది ఈ వ్యాధి తో బాధపడుతున్నారు. ఇక్కడ కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలను లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా ఈ వ్యాధిని కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరిగే ప్రమాదముంది.
– విశ్వాసరాయి కళావతి,
పాలకొండ మాజీ ఎమ్మెల్యే

కిడ్నీ భూతం ఏజెన్సీని భయపెడుతుందా..! అంటే అవుననే సమాధాన

కిడ్నీ భూతం ఏజెన్సీని భయపెడుతుందా..! అంటే అవుననే సమాధాన

కిడ్నీ భూతం ఏజెన్సీని భయపెడుతుందా..! అంటే అవుననే సమాధాన

కిడ్నీ భూతం ఏజెన్సీని భయపెడుతుందా..! అంటే అవుననే సమాధాన

కిడ్నీ భూతం ఏజెన్సీని భయపెడుతుందా..! అంటే అవుననే సమాధాన