
రైతు ఇంట్లో చోరీ
పార్వతీపురం రూరల్: పట్టణ పరిధి శివారు ప్రాంతంలో ఉన్న ఆశాజ్యోతి ఆశ్రమం సమీపంలో ఓ రైతు ఇంట్లో మంగళవారం చోరీ జరిగినట్లు పట్టణ ఎస్సై జగదీష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడిస్తూ ఆశాజ్యోతి ఆశ్రమం సమీపంలో నివాసం ఉంటున్న వంగపండు తిరుపతి రావు అనే వ్యక్తి భార్యతో కలిసి మంగళవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో పొలం పనుల నిమిత్తం వెళ్లి పనులు ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూడగా బీరువా తెరచి ఉన్నట్లు గమనించారని, బీరువాలో ఉన్న నాలుగున్నర తులాల బంగారంతో పాటు రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.