
సుపరిపాలన తొలిఅడుగు విఫలం
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190
రేగిడి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గ్రామాల్లోకి కూటమి ప్రభుత్వ నాయకులు వెళ్లేటప్పుడు స్పందన కరువవడంతోనే ఈ కార్యక్రమం విఫలమైందన్నారు. ఈ మేరకు మంగళవారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకపోవడంతో గ్రామాల్లోకి వెళ్తున్న నాయకులను ప్రజలు నిలదీస్తుండడంతో నాయకులు కూడా ఈ కార్యక్రమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పిలుపుమేరకు చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి వెళ్లి నిర్వహిస్తుంటే ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తోందన్నారు. 2024 జనవరి నెలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొత్త పింఛన్లు మంజూరుచేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరుచేయలేదని ఎద్దేవా చేశారు. కొత్త పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఎదురు చూస్తున్నారని అన్నారు. తల్లికి వందనం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని కలెక్టర్ గ్రీవెన్స్‌కు వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం గమనించాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావు, ఉపాధ్యక్షుడు కెంబూరు వెంకటేశ్వరరావు, కరణం శ్రీనివాసరావు, కెల్ల మన్మథరావు, కింజరాపు సురేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్