
విపత్తుల నివారణకు స్కౌట్స్ అండ్‌గైడ్స్ సేవలు అందించాల
సీతానగరం: స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ పొందిన విద్యార్ధులు విపత్తుల సమయంలో ప్రజల రక్షణకు ఆత్మ విశ్వాసంతో సేవలందించాలని పార్వతీపురం మన్యం జిల్లా డీఈఓ రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో పీఎం స్కూల్స్‌లో విద్యార్ధులకు కోర్సు డైరెక్టర్ నారాయణమూర్తి స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీఈఓ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో అగ్నిప్రమాదాలు, వంటగ్యాస్ ప్రమాదాలు, పరిశ్రమల్లో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు వంటి విపత్కర పరిస్థితుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ఉపయోగ పడతాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓలు చిన్నం నాయుడు, విజయ్‌కుమార్, రజియా బేగం, నరసింహస్వామి, పాల్గొన్నారు.
డీఈఓ రాజశేఖర్