
మీరు చెప్పిన త్రికరణ శుద్ధి ఏమైంది?
గతంలో మేమిచ్చిన పథకాలను సగర్వంగా ప్రజలకు చెప్పాం. ఇప్పుడు కూటమి నేతలు చేస్తున్నది దగా, మోసమే. త్రికరణశుద్ధితో అని హామీల అమలుకు సంతకాలు పెట్టారు. సనాతనవాదిగా చెప్పుకొనే పవన్.. ఎందుకు పాటించడం లేదు. చంద్రబాబును ఎందుకు అడగడం లేదు. ఏడాదిలో ఏం చేశారు? పాఠశాల భవనాలను అర్ధాంతరంగా వదిలేశారు. సాలూరు నియోజకవర్గం మెట్టవలస గ్రామంలో గ్రామస్తులు సొంత నిధులతో రేకులషెడ్డు వేసుకున్నారు. మక్కువలోనే అంతే. సంక్షేమ హాస్టళ్లలో సంక్షోభం పుట్టిస్తున్నారు. కూటమి నేతలు చేస్తున్నది రాక్షస సాలన. రెడ్‌బుక్ రాజ్యాంగం. వారి బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదు. ఎవరికై నా సహనం కొంత వరకే ఉంటుంది. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
– పీడిక రాజన్నదొర,
మాజీ ఉప ముఖ్యమంత్రి
●