బైపీసీకే బాలికల మొగ్గు

సీతంపేటలోని గిరిజన గురుకుల బాలికల 
జూనియర్‌ కళాశాల   - Sakshi

● 40 సీట్లకు 385 మంది దరఖాస్తు ● సీతంపేట గిరిజన గురుకుల బాలికల కళాశాలలో సీట్లకు డిమాండ్‌ ● ఈనెల 8న కౌన్సెలింగ్‌

సీతంపేట: గిరిజన గురుకులాల్లో సీటు లభిస్తే భవి ష్యత్తు బంగారమవుతుందని విద్యార్థులు భావిస్తా రు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందడమే దీనికి కారణం. ఇంట ర్మీడియట్‌ విద్యనభ్యసించేందుకు గిరిజన బాలికల కోసం సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకే ఒక గిరిజన గురుకుల బాలికల జూనియర్‌ కళాశాల ఉంది. ఇక్క డ ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, వృత్తి విద్యాకోర్సు అయిన ఎల్‌అండ్‌టీ గ్రూపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉండగా ఒకేషనల్‌లో మాత్రం 20 సీట్లే ఉన్నాయి. అయితే, కళాశాలలో చేరేందుకు దరఖాస్తు గడువు గత నెల 31తో ముగిసింది. మొత్తం 507 మంది బాలికలు తమకు వివిధ గ్రూపుల్లో సీట్లు కావాలని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఒక్క బైపీసీ గ్రూపులో 40 సీట్లకు 385 మంది గిరిజన బాలికలు దరఖాస్తు చేశారు. మిగతా గ్రూపులు పరిశీలిస్తే ఎంపీసీకి–72, హెచ్‌ఈసీ–36, ఎల్‌అండ్‌టీకీ 14 దరఖాస్తులు వచ్చాయి. వీరందరి కీ ఈ నెల 8న కౌన్సెలింగ్‌ నిర్వహించిన సీట్లు కేటాయిస్తారు. పదోతరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా సీట్లు కేటాయిస్తామని ప్రిన్సిపాల్‌ పి. సూర్యకుమారి తెలిపారు.




 

Read also in:
Back to Top