మాచర్ల రూరల్: కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభలో పాల్గొని ఫుల్‌గా మద్యం తాగిన మత్తులో తెలుగుతమ్ముళ్లు కర్రలతో కొట్టుకొని తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని రాయవరం జంక్షన్ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జమ్మలమడక గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కూరాకుల శ్రీనివాసరావు, రాయవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గాలి బ్రహ్మంలు విజయోత్సవ సభ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే జమ్మలమడక గ్రామం నుంచి శ్రీను తన కొడుకును పిలిపించుకొని రాయవరం వెళ్తున్న గాలి బ్రహ్మం పై దాడికి ప్రయత్నించారు. ఈ దాడులలో ఇరువురు కర్రలతో కొట్టుకున్నారు. ఈ సంఘటనలో కూరాకుల శ్రీనివాసరావు, గాలి బ్రహ్మంకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహించారు.
జర్మనీ అమ్మాయి – దేచవరం అబ్బాయి
నకరికల్లుః నిజమైన ప్రేమకు హద్దులు... సరిహద్దులు లేవని నిరూపించారు ఓ యువ ప్రేమజంట. శుక్రవారం నరసరావుపేటలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన వెంపటి శ్రీనివాసరావు కుమారుడు వెంకటేశ్వర్లు చదువుకునేందుకు జర్మనీ వెళ్లి అక్కడే ఉద్యోగం సాధించాడు. ఈ క్రమంలో అదే దేశానికి చెందిన పొలీన జొరీనతో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి ఫుట్‌బాల్ క్రీడ పట్ల ఆసక్తి కావడంలో తరచూ ఆడేందుకు వెళ్లే క్రమంలో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు 8 ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి సుముహూర్తం నిర్ణయించుకున్నా రు. జర్మనీ, రష్యాల నుంచి వధువు బంధువులు రాగా వరుడు తరపున బంధువులు కలసి నరసరావుపేటలో ప్రేమ వివాహం సంప్రదాయ బద్దంగా జరిపించారు.
ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న
గాలి బ్రహ్మం, కూరాకుల శ్రీనివాసరావు


