న్యూస్‌రీల్
తహసీల్దార్ పోస్టుల కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన
సాగర్ నీటిమట్టం
పులిచింతల సమాచారం
నిమ్మకాయల ధరలు
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
ఆర్జనకు తహతహసీల్దార్లు!
లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో సత్తెనపల్లి ప్రథమం
● అధికార నేతల అండతో
సొంత రెవెన్యూ డివిజన్‌లోనే పోస్టింగు
● తమ్ముళ్ల అవినీతి, అక్రమాలకు వత్తాసు
పలకడమే కారణమని ఆరోపణలు
7
నరసరావుపేట టౌన్: గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉండేవారు ఎవరు వారి సొంత డివిజన్‌లో ఉద్యోగాలు చేయకూడదు. దీనిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. జీవో నెం. 418 కూడా ఇదే చెబుతోంది. పల్నాడు జిల్లాలోని ఉన్నతాధికారులకు మాత్రం ఇవేమీ వర్తించడం లేదు. స్వతంత్ర నిర్ణయాలు, సొంత పాలన చేసుకుంటూ పోతున్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా పల్నాడు జిల్లాలో తహసీల్దార్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. మొన్నటి వరకు డిప్యూటేషన్ పేరిట సొంత మండలాల్లోనే పనులు చక్కబెట్టారు. ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో ప్రసన్నం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టరేట్, ఇతర పాలనా కార్యాలయాల్లో ఈ వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.
తహసీల్దార్‌లు అధికార పార్టీ శ్రేణులతో ఒకలా, ప్రతిపక్ష పార్టీ శ్రేణులతో మరోలా వ్యవహరిస్తూ పక్షపాతం చూపుతున్నారు. ఇప్పటికీ కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి పైరవీలు నడుపుతున్నారు. టీడీపీ నేతల సిఫార్స్‌లతో పోస్టింగ్ తెచ్చుకున్న కారణంగా తహసీల్దార్‌లు స్వామి భక్తి చాటుకుంటూ తెలుగు తమ్ముళ్లకు పనులను చక్కబెడుతున్నారు. పోస్టింగ్‌లు జీవో స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ ఉద్యోగుల బదిలీల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేసే అధికారులు వీరి పోస్టింగ్ విషయంలో మాత్రం ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. జీవోను ఉల్లఘించి జరిగిన పోస్టింగ్‌లపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
పసుపు వైపు.. రైతు చూపు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 516.30 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.05 టీఎంసీలు. ఎగువ నుంచి 4130 క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2300, మోడల్ ధర రూ.1800 వరకు పలికింది.
ఏదైనా చిన్న ధ్రువీకరణ పత్రం కావాలంటే ఆరాలు తీసి చుక్కలు చూపించే తహసీల్దార్లు వారి పోస్టింగుల్లో మాత్రం నిబంధనలకు నీళ్లు వదిలారు. రాజకీయ అండదండలు ఉంటే అయిన వారు, వడ్డించేవారు తమ వారైతే ఎలాంటి జీవోలైనా చెత్తబుట్టలోకి చేరుతాయని నిరూపించారు. పల్నాడు జిల్లాలోని కొందరు తహసీల్దార్లు నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు పొందారు. కొందరు రాజకీయ నేతలు సైతం వారికి వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా చూసిన ప్రజలు ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఐదుగురు తహసీల్దార్‌ల పోస్టింగ్ విషయంలో నిబంధనలను పక్కన పెట్టారు. ప్రస్తుతం చిలకలూరిపేట తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ స్వస్థలం నరసరావుపేట మండలం రావిపాడు గ్రామం. నరసరావుపేట తహసీల్దార్‌గా పనిచేస్తున్న షేక్ హుస్సేన్ స్వగ్రామం చిలకలూరిపేట పట్టణం. అయితే గత ఏడాది కాలంగా డిప్యూటేషన్‌పై వీరిద్దరు పరస్పర స్థానాలు మార్చుకొని ఏకంగా సొంత మండలాల్లో పనిచేశారు. ఇటీవల డిప్యూటేషన్ రద్దు కావటంతో తమ సొంత రెవెన్యూ డివిజన్ పరిధిలోనే విధులు కొనసాగిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పల్నాడు జిల్లాలో ఉన్న 28 మండలాలలో ఐదుగురు తహసీల్దార్‌లు సొంత రెవెన్యూ డివిజన్‌లో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో స్వస్థల గ్రామం క్రోసూరుకు చెందిన కుంభా శ్రీనివాసరావు పెదకూరపాడు తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. అదే విధంగా నూజెండ్ల మండలం తంగిరాల గ్రామానికి చెందిన సుధాకర్ బొల్లాపల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండలానికి చెందిన అర్జున్‌నాయక్, శావల్యాపురం తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.


