● చికిత్స పొందుతూ భార్య మృతి ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
వినుకొండ: భార్యపై అనుమానంతో హత్య చేసిన నిందితుడిని వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ బి. ప్రభాకర్ కథనం ప్రకారం.... వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన దుర్గం సుబ్బమ్మ (26)కు, కొండి అంజనేయులు (37)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన అంజనేయులు భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఈ నెల 10న జరిగిన గొడవ కారణంగా సుబ్బమ్మ ఊరిలోనే ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆంజనేయులు ఈ నెల 11న తెల్లవారుజామున నిద్రిస్తున్న సుబ్బమ్మపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆమెను రక్షించబోయిన తల్లి మహాలక్ష్మమ్మ (65), నిందితుడి తండ్రి పువ్వడయ్య (70)లకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సుబ్బమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో వినుకొండ సీఐ బి. ప్రభాకర్, హెచ్‌సీ సునీల్ బాబు, పీసీలు అశోక్ బాబు, లక్ష్మణ రావుల బందం దర్యాప్తు చేపట్టింది. ఈ నెల 17న సాయంత్రం వినుకొండ–ఏనుగుపాలెం రోడ్డులోని కాశీనాయన ఆశ్రమం వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.


