నకరికల్లు: హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి అన్నారు. మండలంలోని కుంకలగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పీహెచ్‌సిలోని మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌లు, రికార్డులు తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంజీవని కార్యక్రమం, ఎలక్ట్రానిక్ హెల్త్‌కార్డుల నిర్వహణపై వాకబు చేశారు. పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణుల వివరాలు నూటికి నూరుశాతం నమోదు చేయాలన్నారు. పీహెచ్‌సీలో చేస్తున్న రక్తపరీక్షలు గురించి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ధారణ ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఎం.పూజశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారి కొంపల వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ రాధాకృష్ణమూర్తి, స్టాఫ్ నర్స్ శివకుమారి, ఫార్మాసిస్ట్ కల్పన, ల్యాబ్ టెక్నీషియన్ లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి


