పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026 ● సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి విచారణ కోరిన నాయకులు ● జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత ● కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి, డాక్టర్‌ గజ్జల ● క్రీడా మైదానం అంటే తెలియని వారికి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలా..? ● ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకున్న కూటమి ప్రభుత్వం ● మీడియా సమక్షంలో ఆరోపించిన వైఎస్సార్‌ సీపీ నేతలు పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం వివరాలు నిమ్మకాయల ధరలు

న్యూస్‌రీల్‌

మెగా డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌ సీపీ ఆందోళన

రూ.లక్షలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్‌ ధర రూ.3,400 వరకు పలికింది.

నరసరావుపేట: మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలు, నియామకాలపై వెంటనే సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీచే సమగ్ర విచారణ జరిపించి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ప్రవేశ ద్వారం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అగ్రనాయకులనే లోపలికి పంపించారు. పీజీఆర్‌ఎస్‌లో జరిగిన అవకాతవకలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థులే తగిన బుద్ధి చెబుతారు

పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చకుండా దగా చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామంటూ వారే ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా ప్రచారం చేశారన్నారు. ఈ రెండేళ్లలో నిరుద్యోగులకు ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా డీఎస్సీలో దగా చేసి మోసం చేశారన్నారు. అవకతవకలపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 4వేల మంది నిరుద్యోగులకుపైగా అన్యాయం జరిగిందన్నారు. స్పోర్ట్స్‌ కోటా తరఫున 400 నుంచి 500 పోస్టులు అమ్ముకున్నారనే విషయం బయటపడిందన్నారు. మెరిట్‌ జాబితా విడుదల చేయలేదన్నారు. సమగ్ర విచారణ జరపకుండా మాయమాటలు, తప్పుడు ప్రచారాలతో దాటవేసేందుకు ప్రయత్నిస్తే విద్యార్థులు, యువత తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పేదప్రజలు, యువతీయువకులు, విద్యార్థులు, ప్రజల తరఫున తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని హెచ్చరించారు. ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ఎన్నాళ్లో సాగదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు.

యువతకు వెన్నుపోటు

సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల మాట్లాడుతూ చంద్రబాబును చూస్తేనే ప్రజలకు వెన్నుపోటు గుర్తుకు వస్తుందన్నారు. సూపర్‌ సిక్స్‌లో నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు వారికి వెన్నుపోటు పొడిచారన్నారు. చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదన్నారు. డీఎస్సీలో ఒక్కో ఉద్యోగం రూ.15లక్షలు విక్రయించినట్లుగా ఆడియా, వీడియాలు బయటకు వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పడాల శివారెడ్డి, యెనుముల మురళీధరరెడ్డి, జిల్లా ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్‌, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌, నకరికల్లు మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా నుంచి వచ్చిన పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అది దగా డీఎస్సీ

6

పార్టీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పూర్తి అవకతవకల మయమని, అవినీతితో నిండిపోయిందన్నారు. మెరిట్‌ లిస్టులో ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వకుండా రూ.లక్షలకు దొడ్డి దారిన ఉద్యోగాలు అమ్ముకున్నారని స్పష్టం చేశారు. నిజాయితీగా డీఎస్సీ నిర్వహిస్తే మెరిట్‌ లిస్టు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటాలో సుమారు 420 ఉద్యోగాలను ఒక్కో ఉద్యోగం రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన స్పోర్ట్స్‌ కోటాలో అర్హులైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసులకు ఉద్యో గాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. క్రీడా మైదానం అంటే ఏంటో తెలియని వాళ్లకు కూడా రూ.లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు అమ్ము కున్నారన్నారురు. లోకేష్‌కు దమ్ము, ధైర్యం ఉంటే డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మెరిట్‌ లిస్టులో ఉన్నవారు ఉద్యోగాలు కోల్పోయారని, తక్షణమే మెరిట్‌ లిస్టు ప్రకటించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement