గడువులోగా అర్జీలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌కు డాక్టర్‌ ప్రత్యూష్‌ రగ్బీ జిల్లా జట్ల ఎంపిక

నరసరావుపేటరూరల్‌: ఉద్యోగాల పేరుతో మోసాలపై పీజీఆర్‌ఎస్‌లో పలు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీ(అడ్మిన్‌) జేవీ సంతోష్‌ పాల్గొని ఫిర్యా దులు స్వీకరించారు. కుటుంబ, ఆస్తి, ఆర్థిక, తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించిన 65 ఫిర్యాదులు అందాయి. ఇందులో భార్యభర్తల వివాదాలపై 15, ఆర్థిక వ్యవహారాలపై 11, భూ వివాదాలు–8, ఆస్తి వివాదాలు–7 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషిచేయాలని తెలిపారు.

సత్తెనపల్లి: సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2024 ఫలితాల్లో ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు సెలెక్ట్‌ అయిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సంజీవ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 147 మందికి వివిధ రాష్ట్రాలను కేటాయించారు. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2024 ఫలితాల్లో 797వ ర్యాంక్‌ సాధించిన పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన డాక్టర్‌ పెండెం ప్రత్యూష్‌కు ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.త్వరలో శిక్షణ అనంతరం డాక్టర్‌ పెండెం ప్రత్యూష్‌కు రాష్ట్రంలో పోస్టింగ్‌ కేటాయించనున్నారు.

సత్తెనపల్లి: రగ్బీ పల్నాడు జిల్లా జూనియర్‌ బాల, బాలికల జట్ల ఎంపిక సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగింది. పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపికల కార్యక్రమానికి జిల్లా రగ్బీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈవూరి కృష్ణారెడ్డి హాజరై ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6, 7 తేదీల్లో నందిగామలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్‌ కార్యదర్శి పి.డానియేల్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వివరాలను ఆయన వెల్లడించారు. బాలుర జట్టుకు.. ఎల్‌.పార్థసారథి, వై.జస్వంత్‌, వి.సుప్రీత అభిషేయ్‌, ఇ.భువన చంద్రారెడ్డి, ఎం.భానుతేజ, బి.ప్రసన్నకుమార్‌, జి.జయభాను యాదవ్‌, బి.జ్యోతిబాబు, ఐ.జాన్‌, ఎం.కౌశిక్‌, డి.శివశంకర్‌, కె.రామ్‌ చరణ్‌, స్టాండ్‌ భైలుగా సి.రామ్‌మనోహర్‌, కె. మరియుబాబు ఎంపికయ్యారు,

బాలికల జట్టు

పి.అలేఖ్య, పి.కోమలి, ఇ.లాస్య, ఎ.పూజిత, సి.హెచ్‌. ప్రీతి, సీహెచ్‌.జ్ఞానశ్రీ అర్చన, బి.మహి, పి.శైలజ, బి. శైలజ, బి.గంగాభాయి, కె.సుకన్య, ఎన్‌.అలేఖ్య, స్టాండ్‌ బైలుగా ఎన్‌.నందిని, సీహెచ్‌.శ్రావ్యలు ఎంపికయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకరపర్తి శ్రీనివాసరావు, ఫిజికల్‌ డైరెక్టర్‌లు పి.శివరామకృష్ణ, వై.పూర్ణచంద్రరావు, లాకు పిచ్చయ్య, వై.చిరంజీవి, క్రీడాకారులు పాల్గొన్నారు.

లోపాలు లేకుండా రీ సర్వే

బొల్లాపల్లి: లోపాలు లేకుండా పకడ్బందీగా రీ సర్వే నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ అధికారులకు సూచనలు చేశారు. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌తో పాటు, ఏడీ సర్వే,భాను కీర్తి, నరసరావుపేట ఆర్డీవో ఏ బాలకష్ణ మండలంలో రేమిడిచర్ల, గుమ్మనంపాడు గ్రామాల్లో రీ సర్వే పనులను తనిఖీ చేశారు. స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుమ్మనంపాడు పంచాయతీ పరిధిలోని నిమ్మల సుబ్బయ్య కుంట తండాను సందర్శించారు. తండావాసులు రహదారి కోసం పీజీఆర్‌ఎస్‌లో అందజేసిన అర్జీని పరిశీలన అనంతరం తండావాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి మార్గం చూస్తామని తండావాసులకు హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement