అర్జీలు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలి

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

జిల్లా రెవెన్యూ అధికారి నారదముని

నరసరావుపేట: అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లకు అధ్యక్షత వహించి జిల్లా నలుమాలల నుంచి వచ్చిన వారిచే 152 అర్జీలు స్వీకరించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు గడువులోపు అర్జీలను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. ప్రతిరోజు అర్జీలను మానిటర్‌ చేయాలని, గడువు తీరకముందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. అర్జీలను ఎలాంటి పెండింగ్‌ ఉంచరాదని, పెండింగ్‌ ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement