పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

సోమవారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2026 ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూకు తాళాలు పులిచింతల సమాచారం వైభవంగా జ్యేష్ఠాభిషేకం

న్యూస్‌రీల్‌

వైద్యసేవలు అందక బాలింత మృతి

నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యం ధైన్యం ఐసీయూకి కొద్ది రోజులుగా తాళాలు అత్యవసర వైద్యం అందని పరిస్థితి గాలిలో కలుస్తోన్న ప్రాణాలు పట్టించుకోని వైద్యాధికారులు ఇదేమి ప్రభుత్వమంటూ నిలదీస్తోన్న ప్రజలు

సోమవారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2026
ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూకు తాళాలు

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

వినుకొండ: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లోగల అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం 108 కలశాలతో విశేష జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు.

మాజీ మంత్రి వెంకటరెడ్డికి కన్నీటి వీడ్కోలు

పావులూరు(చినగంజాం): మాజీ మంత్రి, రాష్ట్ర సీనియర్‌ నాయకుడు గాదె వెంకటరెడ్డి అంతిమ యాత్ర ఆదివారం ఆయన స్వగ్రా మం ఇంకొల్లు మండలం పావులూరులో ఆదివారం నిర్వహించారు. ప్రముఖులు, అభిమానుల సందర్శన అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ఆఖరి మజిలీ యాత్ర రథంపై ఆయన భౌతికకాయం ఉంచారు. బ్యాండు మేళం, బాణసంచాతో భారీ జనసందోహం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అనుసరించారు. గాదె వెంకటరెడ్డి పెద్ద కుమారుడు, వైఎస్సార్‌ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డితో పాటు సోదరులు సుధాకరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి వారి సొంత ఫార్మింగ్‌ స్థలం వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు ఇన్‌చార్జి వరి కూటి అశోక్‌బాబు, బాపట్ల జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు గవిని శ్రీనివాస్‌, గాదె శివరామకృష్ణారెడ్డి, బొల్లెద్దు ప్రతాప్‌, బి.నరేంద్రరెడ్డి, బొర్రెపాటి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్‌, దాసరి కిరణ్‌బాబు, వైఎస్సార్‌ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి, పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి యడం బాలాజీ, వారి సోదరుడు లక్ష్మీదీపక్‌, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, రాయపాటి అరుణ నివాళులర్పించారు. అంతియాత్రలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక గొప్ప నాయకుడు, నిరంతర ప్రజా సేవా తత్పరుడు వెంకటరెడ్డిని కోల్పోవడం బాధాకరం అన్నారు.

ఊపిరి అందక ఒకరు.. గుండె ఆగిపోతూ మరొకరు... ప్రమాదం బారినపడి అత్యవసర వైద్యం కోసం ఇంకొకరు ఐసీయూ వైపు కదులుతుంటే మూసి ఉన్న తలుపులు ప్రభుత్వ వైద్య దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఐసీయూ అంటే తుదిశ్వాసకు ఆయువు పోసే దేవాలయం.. అలాంటి ఐసీయూకి తాళాలను చూసి పేదోళ్ల కన్నీళ్లు పొంగుతున్నాయి. ఐసీయూకి వేసింది తాళాలు మాత్రమే కాదు.. నిరుపేదల అత్యవసర వైద్య హక్కుకు సంకెళ్లు. కార్పొరేట్‌ ఆస్పత్రి వైపు కన్నెత్తి కూడా చూడలేని నిర్భాగ్యులకు మేమున్నామంటూ అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని గాలికొదిలేస్తుండడంతో అభాగ్యుల ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి.

నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఏరియా వైద్యశాలలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు చివరి ఆశగా ఉండాల్సిన ఐసీయూ విభాగం కొన్ని నెలలుగా తాళాలు వేసి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అందించే వైద్యం ప్రతినిమిషం విలువైందే. అటువంటి అత్యవసర బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసీయూ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తుంది.

అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్న రోగులు, వారి సహాయకులకు ఐసీయూ తలుపులపై వేలాడుతున్న తాళాలు కనిపిస్తున్నాయి. ఆపదలో కాపాడాల్సిన విభాగం మూతపడటం అంటే పేదల ప్రాణాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల ఖర్చులు భరించలేని నిరు పేదలకు ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు అలాంటి వైద్యశాల్లో ప్రాణ రక్షక సేవలు నిలిచిపోతే ప్రజలు ఎక్కడకు వెళ్లాలన్నా ప్రశ్న తలెత్తోంది.

అత్యవసరమైతే గుంటూరే..!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తరువాత రోగులు ప్రతి రోజు అధిక సంఖ్యలో వచ్చేది నరసరావుపేట ఏరియా వైద్యశాలకే. ప్రతిరోజు 1000 కి పైగా ఓపీ నమోదు అవుతూ ఉంటుంది. మొదట 200 పడకల వైద్యశాలగా ఉన్న ఏరియా ఆసుపత్రిని 350 పడకలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. దాదాపుగా అన్ని విభాగాలకు అనుభవజ్ఞులైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని ఐసీయూ విభాగానికి తరలించి పర్యవేక్షణలో ఉంచుతారు. దీంతో పాటు గర్భిణులకు సంబంధించి హైరిస్క్‌ కేసులను ఐసీయూకు తరలిస్తారు. అయితే గత కొన్ని నెలలుగా ఐసీయూ అందుబాటులో లేకపోవటంతో అత్యవసర సేవలు అవసరమైన రోగులను గుంటూరుకు తరలిస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో వైద్యశాల భవనాన్ని నిర్మించారు. ఐసీయూకి కావాల్సిన పరికరాలన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఐసీయూ అందుబాటులోకి తేకపోవటం విమర్శలకు తావిస్తుంది. ఐసీయూ విభాగాన్ని పూర్తిగా మూసివేసి తలుపుపై ఇటీవల సన్‌ స్ట్రోక్‌ వార్డుగా పోస్టర్‌ అంటించారు. వడదెబ్బ తగిలి వైద్యశాల్లో చేరేవారు లేకపోవటంతో ఆ వార్డును కూడా తెరవటంలేదు.

ఏటా పెరుగుతున్న మరణాలు

ఏరియా వైద్యశాల్లో ప్రతి ఏటా మాతా, శిశు మరణాలు పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవటంలేదన్నా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024–25 లో 183 మంది శిశువులు మృతి చెందగా, 8 మంది బాలింతలు మృతి చెందారు. 2025–26లో 179 మంది శిశువులు మృతి చెందగా, 10 మంది బాలింతలు ప్రసవ సమయంలో మృతి చెందారు.

7

ఐదు రోజుల క్రితం నకరికల్లు మండలానికి చెందిన గర్భిణి వైద్యశాలలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆమెకు ప్రసవం అనంతరం సీరియస్‌ కావడంతో మెరుగైన వైద్యసేవలు అందక.. గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వస్తున్న రోగులకు సరిపడా సిబ్బంది లేకపోవటంతో సేవల్లో జాప్యం జరుగుతుందని రోగులు వాపోతుండగా, మరో వైపు పని ఒత్తిడి కారణంగా మెరుగైన సేవలు అందించలేక పోతున్నామని వైద్యులు, సిబ్బంది చెప్పుకొస్తుండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement