విద్యతోనే సామాజిక అసమానతలు దూరం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే సామాజిక అసమానతలు దూరం

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

గుంటూరు మెడికల్‌: మహాత్మ జ్యోతి రావు పూలే, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ జనతాదళ్‌ అధికార ప్రతినిధి డాక్టర్‌ కాంచన యాదవ్‌ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో శ్రీకష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత, కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా వ్యాప్తంగా 1500 మంది పాల్గొన్నారు. శ్రీకష్ణ యాదవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్‌ కాంచన యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం నేటి యువతకు ఉందన్నారు. హేతువాద దక్పథం, పరిశీలన శక్తి శాసీ్త్రయ అవగాహన అవసరమని పేర్కొన్నారు. విమర్శనాత్మక దృష్టి విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. 2004లో ప్రారంభమై నేటికీ ప్రతి ఏడాది పదోతరగతి విద్యార్థులకు కెరీర్‌ గైడెన్‌న్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. సభాధ్యక్షుడు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదలకు అందకుండా చేశారన్నారు. విద్యారంగం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయిందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్వీ శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీవీ శ్రీనివాసరావు, కోశాధికారి టి.రామకృష్ణ ,ఉపాధ్యక్షులు పెరుగు ఏడుకొండలు, ఎ.రాంబాబు, ఎ.మధు కుమార్‌, సాంబశివరావు, డొక్కా శ్రీనివాస్‌ రావు, దర్శి హరినాథ బాబు, దాసరి శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు 8 లక్షల నగదును అందించారు.

ఆర్జేడీ అధికార ప్రతినిధి

డాక్టర్‌ కాంచన యాదవ్‌

Advertisement
 
Advertisement
Advertisement