చిలకలూరిపేట: సూర్యవంశ వడియ రాజులకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు డిమాండ్ చేశారు. సూర్యవంశ వడియ రాజుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని మెడికల్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న తమ సామాజిక వర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, రాజకీయంంగా, సామాజకంగా వడియరాజులు ఇంకా వెనుకబడే ఉన్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే కనీసం పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమకు చట్టసభల్లో సముచిత స్థానం లభించాల్సి ఉందన్నారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 10 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలు తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు సంబందించిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కందుల రవీంద్రరాజు, బత్తుల లక్ష్మీకాంతయ్య, వేముల శివరాజు, ఓర్సు వీరభాస్కర్, తన్నీరు రమణయ్య, వేముల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు


