రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్‌ఐ మణికృష్ణ తెలిపారు.


