ఇంకొల్లు (చినగంజాం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మృతిచెందగా, శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరు లోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరై సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంఎల్‌సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, దర్శి ఎమ్మెల్యే, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితరులు నివాళులర్పించారు. వారితో పాటు రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్, నరసరావుపేట, చీరాల మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, మార్కాపురం కేపీ కొండారెడ్డి, చీరాల పార్టీ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లాటి ఏడుకొండలు, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, అంబటి హరినాథ్ , మారెళ్ళ వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, రామారావు, వై శివారెడ్డి, పర్చూరు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌లు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు, గ్రామ అధ్యక్షులు, అభిమానులు, రిటైర్డ్ అధికారులు నివాళులర్పించారు.
సజ్జల, అంబటితో పాటు హాజరైన పలువురు నాయకులు


