నగరంపాలెం: పోలీస్ శాఖలో ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయడమనేది సంతోషకరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఎస్‌ఐలు షేక్ సలాం(పెదకాకాని పీఎస్), ఎం.బ్రహ్మయ్య(తెనాలి పీసీఎస్), ఏఎస్‌ఐలు కె.రాజశేఖర్‌బాబు(నల్లపాడు పీఎస్), అన్వర్ బాషా(ఎస్‌బీ), షేక్ సత్తార్(దుగ్గిరాల పీఎస్), రాధాకృష్ణమూర్తి(కాకుమాను పీఎస్), హెడ్‌కానిస్టేబుళ్లు సీహెచ్ చంద్రశేఖర్‌రావు(పెదకాకాని పీఎస్), నున్న సాంబశివరావు(నగరంపాలెం పీఎస్), ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు కరిముల్లాఖాన్, ఎస్.వరప్రసాద్‌రావు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయమని అన్నారు. మిగతా జీవితాన్ని ఆనందంగా జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏ హనుమంతు(ఏఆర్), ఎస్‌బీ డీఎస్పీ అళహరి శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్‌ఐ సురేష్, జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య, కరిముల్లా, హుస్సేన్, మైల సాంబశివరావు, పీఆర్‌ఓ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


