విద్యుత్‌ స్తంభాల కింద పడి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాల కింద పడి బాలుడు మృతి

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

దాచేపల్లి: విద్యుత్‌ స్తంభాల కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని దుర్గాభవానీ కాలనీలో జరిగిన ఈ ఘటనలో అదే కాలనీకి చెందిన ఆవుల శ్రీను, హనుమమ్మ దంపతుల చిన్న కుమారుడు పవన్‌ (5)దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పవన్‌ తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా ఆడుతున్నాడు. కాలనీలో నిల్వ చేసిన విద్యుత్‌ స్తంభాలు ఎక్కి పిల్లలందరూ సరదాగా ఆడుకుంటుండగా పోల్స్‌ జారి పవన్‌ మీద పడ్డాయి. పవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పవన మృతదేహన్ని చూసిబోరున విలపించారు. పవన్‌ తండ్రి శ్రీను రెండేళ్ల క్రితం మృతి చెందాడు. పవన్‌కి అన్న అంజి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేందుకు స్థానిక నాయకులు చర్చలు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement