నరసరావుపేట రూరల్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలం పోలీసు శాఖలో బాద్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది అభినందన కార్యక్రమం శనివారం నిర్వహించారు. నరసరావుపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఆర్.మంత్రునాయక్, యడ్లపాడు ఏఎస్‌ఐ ఎస్‌కె ఇస్మాయిల్, చిలకలూరిపేట ఎస్‌బీ ఏఎస్‌ఐ వై.శ్రీనివాసరావు, నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు, జిల్లా డీఏఆర్ ఏఎస్‌ఐ సిహెచ్ శామ్యూల్, కానిస్టేబుల్ పి.రహమతుల్లా ఖాన్, మాచర్ల హోంగార్డ్ బి.రాజానాయక్‌లు శనివారం ఉద్యోగ విరమణ పొందారు. వీరిని జిల్లా ఎస్పీ పూలమాలలు, బహుమతులతో సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో, ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజానికి మంచి పోలీసు సేవలు అందించిన మీ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ( ఏఆర్) వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, హోంగార్డ్ ఆర్‌ఐ ఎస్.కృష్ణ, వెల్పేర్ ఆర్‌ఐ ఎల్.గోపినాథ్ పాల్గొన్నారు.


