స్థల వివాదంలో అన్నదమ్ముల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

స్థల వివాదంలో అన్నదమ్ముల ఘర్షణ

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

చిలకలూరిపేట టౌన్‌: మండలం పరిధిలోని వేలూరు గ్రామం ఎస్సీ కాలనీలో శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరుసకు అన్నదమ్ములు ఘర్షణకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు ఎస్సీ కాలనీకి చెందిన వంజా జ్ఞానయ్య, వంజా సురేంద్రం వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. కొంతకాలంగా వీరి మధ్య నాలుగు సెంట్ల స్థలానికి సంబంధించి తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లిది. ఘర్షణ అనంతరం ఇరువర్గాల వారు చిలకలూరిపేట రూరల్‌ పోలీస్‌స్టేషనుకు చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్‌ ఎస్‌ఐ జి. అనిల్‌కుమార్‌ తెలిపారు.

ఆప్తమాలజీ హెచ్‌ఓడీగా డాక్టర్‌ శ్రీదేవి

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ కంటి వైద్య విభాగాధిపతిగా డాక్టర్‌ శ్రీదేవిని నియమిస్తూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంటి వైద్య విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ రవిబాబు ఉద్యోగ విరమణతోపాటు, డాక్టర్‌ శ్రీదేవిని హెచ్‌ఓడీగా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement