పోలీసులకు అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు అప్రమత్తత అవసరం

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

నరసరావుపేట: ఈవీఎం గోడౌన్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ ఆదేశించారు. శుక్రవారం స్థానిక మార్కెట్‌ యార్డులో ఉన్న ఎలక్ట్రానిక్‌ ఓటింగు మిషన్ల (ఈవీఎం) గోడౌన్‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్‌ వద్ద సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఈవీయం యంత్రాలు బి.యులు, సి.యులు, వీవీ ప్యాట్‌లు, అక్కడి భధ్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్‌కు పటిష్ట భద్రత కల్పించామన్నారు. ఎప్పటికప్పుడు గౌడౌన్‌ను క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. డీఆర్‌ఓ నారదముని, ఆర్‌డీఓ కె.బాలకృష్ణ, తహసీల్దార్‌ వేణుగోపాలరావు పాల్గొన్నారు.

సర్‌కు రాజకీయ పార్టీలు సహకరించాలి

జిల్లాలో ఓటరు జాబితా పారదర్శకంగా, దోషాలు లేకుండా నవీకరించడానికి చేపట్టిన ప్రక్రియ (సర్‌) జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై రాజకీయపార్టీల ప్రతినిధులతో ఇన్‌చార్జి కలెక్టర్‌ సమీక్షించారు. డీఆర్‌ఓ నారదముని పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు

Advertisement
 
Advertisement
Advertisement