నిజమైన ఓటు తొలగించకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

నిజమైన ఓటు తొలగించకుండా చూడాలి

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

పిడుగురాళ్ల: అధికారులు నిజమైన ఓటు తొలగించకుండా బూత్‌లెవల్‌ ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పిడుగురాళ్ల పట్టణ, మండల బూత్‌లెవల్‌ ఏజెంట్లకు సర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణంలోని కె కన్వెక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అధికారులు నిజమైన ఓటును తొలగించే ప్రయత్నం చేస్తే వారిపైన కోర్టుకు వెళ్లి, అవసరమైతే ఎంత దూరమైన పోదామని తెలిపారు. తప్పున చేసిన అధికారులకు శిక్ష పడేలా చేద్దామన్నారు. నిజమైన ఓటు ఒక్కటి తొలగించినా వదిలే ప్రసక్తే లేదన్నారు. వీధిపోరాటం అంటే ఏమిటో అధికారులకు చూపిద్దామని తెలిపారు. తప్పు చేసిన అధికారులు సస్పెండ్‌ అయ్యేంత వరకు మన పోరాటం ఆగదని పేర్కొన్నారు. మనకు ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉందని ప్రతి ఒక్కరు బూత్‌లలో పనిచేసి, నిజమైన ఓట్లు తొలగకుండా చూడటం, అర్హత ఉన్న ఓట్లను నమోదు చేయించటం, దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడటం కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాలను సర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రొఫార్మలో స్పష్టంగా ఉందని తెలిపారు. పట్టణంలో ఉన్న 53 ఎన్నికల బూత్‌లు, పిడుగురాళ్ల మండలంలోని 61 ఎన్నికల బూత్‌లలో బూత్‌ లెవల్‌ ఏజెట్లతోపాటు సీనియర్‌ నాయకులు 10 నుంచి 15 బూత్‌లకు ఒకరు ఏర్పాటు చేసి ఐక్యంగా విధులు నిర్వహించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం స్టేట్‌ బూత్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ సుధాకర్‌రెడ్డి ఈ అంశాలపై క్షుణ్ణంగా బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. డిజిటల్‌ స్క్రీన్‌పై సర్‌ సంబంధించిన అంశాలను అర్దమయ్యే విధంగా చూపిస్తూ వివరించారు.

ఈ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కూడా కూర్చొని డిజటల్‌ స్క్రీన్‌ ద్వారా బూత్‌లెవల్‌ ఏంజెట్లకు వివరింపజేయించారు. కార్యక్రమం వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ మందాల కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మండల కన్వీనర్‌ చింతా సుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ షేక్‌ జైలాబ్దిన్‌, పట్టణ ఉపాధ్యక్షులు కందులూరి శివయ్య, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, ఎంపీపీ గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి చల్లా పిచ్చిరెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షులు కొమెర వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు కాలే మాణిక్యరావు, వైస్‌ ఎంపీపీ సాతులూరి బాబు, మాజీ ఎంపీపీ గండికోట కోటేశ్వరరావు, బూత్‌ వింగ్‌ కన్వినర్‌ ఇల్లూరి వెంకయ్య, మున్సిపల్‌ కౌన్సిలర్లు షేక్‌ అబ్దుల్లా, కొక్కెర శ్రీను, గుర్రం అప్పిరెడ్డి, జూలకంటి శ్రీనివాసరావు, కత్తెరపు వాసుదేవరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కత్తెరపు రామ్‌గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ ఏంజెట్లు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement