ఉత్తమ ప్రదర్శన ‘చెరిగిపోని చిరునామా’ | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రదర్శన ‘చెరిగిపోని చిరునామా’

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

ముగిసిన జాతీయస్థాయి నాటికల పోటీలు ద్వితీయ బహుమతి ‘పొన్నూరు వారి సూక్తం’

నాదెండ్ల: సాతులూరు గ్రామంలో ఈ నెల 24 నుండి 28 వరకూ జరిగిన నాలగవ జాతీయ స్థాయి నాటికల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. నటరత్న ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. గురువారం రాత్రి విజేతలకు బహుమతులు అందించారు. ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ హర్షా క్రియేషన్స్‌ ‘చెరిగిపోని చిరునామా’ నాటిక ఎంపికై ంది. పొన్నూరు శ్రీ విశ్వకళా చైతన్య వేదిక ‘సూక్తం’ నాటికకు ద్వితీయ స్థానం, ఏలూరు హేలాపురి కల్చలర్‌ అసోసియేషన్‌ ‘అనగనగా ఒక రాత్రి’ నాటికకు తృతీయ స్థానం దక్కింది. ఉత్తమ ప్రోత్సాహక నాటికగా హైదరాబాద్‌ స్వర్ణసూ ర్య డ్రామా లవర్స్‌ ‘శ్రీమాత్రే నమః’, ఉత్తమ హాస్య నాటికగా యడ్లపాడు మానవతా క్రియేషన్స్‌ ‘బావా ఎప్పుడు వచ్చితివి’ పురస్కారాలు అందుకున్నాయి.

ఉత్తమ దర్శకుడిగా ‘సూక్తం’ నాటిక దర్శకుడు జీవీ మనోహర్‌, ఉత్తమ రచయితగా ‘మలిసంధ్య’ నాటిక రచయిత గోవిందరాజుల నాగేశ్వరరావు, ఉత్తమ నటుడిగా ‘చెరిగిపోని చిరునామా’ నాటికలో సుబ్బారావు క్యారెక్టర్‌ ధరించిన కట్టా శ్యామ్‌ప్రసాద్‌, ఉత్తమనటిగా ‘చెరిగిపోని చిరునామా’నాటికలో సావిత్రి పాత్ర పోషించిన అమృతవర్షిణి, ద్వితీయ ఉత్తమ నటుడిగా ‘అనగనగా ఒకరాత్రి’ నాటికలో ఎమ్మెల్యే పాత్ర ధరించిన విజయ్‌కుమార్‌, ద్వితీయ ఉత్తమనటిగా ‘సీ్త్రమాత్రేనమః’ నాటికలో శ్వేత పాత్ర ధరించిన సురభీప్రియాంక, ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా ‘సీ్త్రమాత్రేనమః’ నాటికలో సత్యానంద పాత్రధారుడు ఉదయ్‌ భాగవతుల, ఉత్తమ క్యారెక్టర్‌ నటిగా ‘అనగనగా ఒక రాత్రి’ నాటికలో కీలా పాత్రధారిణి వై భవాని, ఉత్తమ ప్రతినాయకుడిగా ‘చెరిగిపోని చిరునామా’ నాటిక లో రఘురామ్‌ ప్రాతధారి భాగ్యరాజ్‌, ఉత్తమ హాస్యనటుడిగా ‘బావా ఎప్పుడు వచ్చితివి’ నాటికలో సుబ్బారావు పాత్రధారి ముత్తవరపు సురేష్‌బాబు, ఉత్తమ హాస్యనటిగా ‘బావా ఎప్పుడు వచ్చితివి’నాటికలో సుబ్బలక్ష్మి పాత్ర పోషించిన లహరి, ఉత్తమ బాల నటిగా ‘విజేతలు’ నాటికలోని నాగప్రభ పాత్రధారిణి ఉహాశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సంగీతం వై సాయితేజ, ఉత్తమ ఆహార్యం పి శేషగిరి, ఉత్తమ రంగాలంకరణ అనిల్‌, శ్రీకర్‌, జ్యూరీ–1 సాత్విక, జ్యూరీ–2 శొంఠినేని శ్రీనివాసరావు అందుకున్నారు. విజేతలకు పరిషత్‌ నిర్వాహకులు బండారుపల్లి సత్యనారాయణ, నడింపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా నగదు, మెమోంటో అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement