నాదెండ్ల: జూన్ 13న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్‌రోల్‌మెంట్‌పై హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు దృష్టి సారించి గతేడాది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని డీఈవో పీవీజే రామారావు అన్నారు. నాదెండ్ల మండల విద్యా వనరుల కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఎంఈవోలు, సీఆర్‌పీలు, పీఐటీలు, ఎమ్మార్సీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలంలో డ్రాపవుట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో కృష్ణారెడ్డి మాట్లాడుతూ డ్రాపవుట్‌లు సుమారు 600 మంది ఉన్నారని, తాము విద్యార్థు ఇళ్లను సందర్శించినపుడు ఇతర ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారని, మరికొన్ని కుటుంబాలు వలస వెళ్లాయన్నారు. ఇప్పటి వరకూ ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకూ 5100 మంది విద్యార్థులు ఎన్‌రోల్ అయినట్లు వివరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఈవో షేక్ మాబుసుభాని ఉన్నారు.
డీఈవో రామారావు


